Current Affairs Telugu Daily

సైయెంట్‌కు IACC అవార్డు
ఇంజినీరింగ్‌, ఐటీ సేవ సంస్థ సైయెంట్‌కు లీడర్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ ఇన్నేవేషన్‌ అవార్డు లభించింది. ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (IACC) నిర్వహించిన 13వ ఇండో అమెరికన్‌ కార్పొరేట్‌ ఎక్సెలెన్సీలో భాగంగా ఈ పురస్కారం లభించింది. వ్యాపార నిర్వహణలో వినూత్న పద్ధతుల అనుసరించిన సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు. అమెరికా, భారత్‌ మధ్య వ్యాపారాలు నిర్వహించే సంస్థలు, వ్యక్తులను IACC ఈ అవార్డు కోసం పరిగణనలోనికి తీసుకుంటుంది. వ్యాపార, అమెరికా ప్రభుత్వ అధికారులతో కూడిన స్వతంత్ర బృందం ఈ అవార్డుకు విజేతను ఎంపిక చేస్తుంది.
IACC-Indo-American Chamber of Commerce

views: 897

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams