Current Affairs Telugu Daily

నెహ్రూ, ఎడ్వీనాల మధ్య అద్భుత అనుబంధం
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, చివరి వైస్రాయ్‌ మౌంట్‌ బాటన్‌ భార్య ఎడ్వీనాల మధ్య నెలకొన్న సంబంధంపై సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. తాను రాసిన ‘డాటర్‌ ఆఫ్‌ యాన్‌ ఎంపైర్‌: లైఫ్‌ యాజ్‌ ఎ మౌంట్‌బాటన్‌’ అనే పుస్తకంలో వీరి అనుబంధంపై నెలకొన్న అపోహను తొలగించేందుకు మౌంట్‌ బాటన్‌ కూతురు పమేలా హిక్స్‌నీ మౌంట్‌ బాటన్‌ ప్రయత్నించారు. నెహ్రూ, ఎడ్వీనాల మధ్య అద్భుత అనుబంధం, పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి కానీ.. అందరూ అనుకున్నట్లు వారిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని పేర్కొంది. భారత్‌ నుంచి వెళ్లిపోయే ముందు తనకిష్టమైన ఎమరాల్డ్‌ ఉంగరాన్ని నెహ్రూకివ్వాలని ఎడ్వీనా అనుకుందని, నెహ్రూ అందుకు అంగీకరించరని తెలిసి, ఆ ఉంగరాన్ని ఆయన కూతురు ఇందిరకు ఇచ్చిందని పమేలా తెలిపారు.
views: 1336

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams