Current Affairs Telugu Daily

మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా
మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా
మహిళ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా
అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ను తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మిథాలీకి ప్రభుత్వం తరఫున రూ.కోటి
నగదు ప్రోత్సాహం ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ
కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. మిథాలీ కోచ్‌ మూర్తికి రూ.25 లక్షల
నగదు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2017 జులై 28న మిథాలీరాజ్‌ ప్రగతి భవన్‌లో
ముఖ్యమంత్రిని కలిశారు.

views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams