Current Affairs Telugu Daily

భారత్‌పై అణ్వస్త్ర దాడి చేద్దామనుకున్నా  : ముషారఫ్‌
భారత్‌పై అణ్వస్త్రాలతో దాడి చేసేందుకు ఒకానొక సమయంలో తాను తీవ్రంగా యోచించానని పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ వెల్లడించారు. అయితే, భారత్‌ చి ప్రతీకార అణుదాడులు తప్పవేమోననే భయంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. ముషారఫ్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ జపాన్‌ పత్రిక ‘మైనిచి షింబున్‌’ తాజాగా ఓ కథనాన్ని వెలువరించింది. 2002లో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు.. అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను తాను తోసిపుచ్చబోనని ముషారఫ్‌ బహిరంగంగానే ప్రకటించారు. పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్‌ గత ఏడాదిగా దుబాయ్‌లో ఉంటున్నారు.
views: 1031



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams