Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ ఆసియా-200 ఉత్తమ సంస్థల్లో కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్‌ 
బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6,500 కోట్ల) కంటే తక్కువ ఆదాయం కలిగిన ఆసియా నమోదిత కంపెనీలో, ఉత్తమమైన వాటితో రూపొందిన ఫోర్బ్స్‌ ఆసియా 2017 జాబితాలో హైదరాబాద్‌ సంస్థకు చోటు దక్కింది. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి సంస్థ  కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ (మార్కెట్‌ విలువ 77 మిలియన్‌ డాలర్లు-సుమారు రూ.500 కోట్లు) ఈ జాబితాలో ఉంది. ఇదికాక దేశీయ సంస్థలు మరో 2 ఈ జాబితాలో ఉన్నాయి. వడోదరా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పండ్ల రసం, పల్ప్‌ తయారీ సంస్థ మన్‌పసంద్‌ బెవరేజెస్‌ (675 మిలియన్‌ డాలర్లు-సుమారు 4380 కోట్లు), చెన్నై కేంద్రంగా క్లౌడ్‌ సొల్యూషన్లు అందించే 8కే మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ (257 మిలియన్‌ డాలర్లు-సుమారు రూ.1670 కోట్లు) ఈ జాబితాలో నిలిచాయి. మొత్తం 18,000 సంస్థను పరిశీలించగా, 875 వరకు ఫోర్ట్స్‌ ఆసియా తెలిపిన అర్హతలు సాధించాయి. తుది ఎంపికకు 200 సంస్థతో జాబితా రూపొందించారు. 
views: 1050

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams