Current Affairs Telugu Daily

బుకర్‌ ప్రైజ్‌ ఎంపిక జాబితాలో అరుంధతీరాయ్‌ నవల
ప్రఖ్యాత భారతీయ రచయిత్రి అరుంధతీరాయ్‌ రాసిన ‘ది మినిస్ట్రీ ఆఫ్‌ అట్‌మోస్ట్‌ హ్యాపీనెస్‌’ 2017 సంవత్సరానికి మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ ఎంపిక జాబితాలో నిలిచింది. 144 పుస్తకాల వడపోత అనంతరం మొత్తం 13 పుస్తకాలను(నవలలు) జాబితాలోకి ఎంపిక చేశారు. ఆంగ్లంలో రాసి, యూకేలో ప్రచురితమయ్యే సృజనాత్మక రచనకు (ఏ దేశ రచయితలైనా) అవార్డులందించేందుకు మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను 1969లో ఏర్పాటు చేశారు. విజేతకు 50 వేల పౌండ్ల (సుమారు రూ.42 లక్షలు) నగదుతో పాటు, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆ పుస్తకాన్ని బహూకరిస్తారు. 6 పుస్తకాలతో తుది జాబితాను సెప్టెంబరు 13న, విజేతను అక్టోబరు 17న ప్రకటిస్తారు.
views: 1684

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams