Current Affairs Telugu Daily

శాస్త్రవేత్త యశ్‌పాల్‌ మృతి
ప్రముఖ భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌(90) 2017 జులై 24న నోయిడాలో మృతి చెందారు. యశ్‌పాల్‌ కాస్మిక్‌ కిరణాల అధ్యయనంలో ఆయన విశేష కృషి చేశారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు.1986-91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌గాను యశ్‌పాల్‌ పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్‌పాల్‌ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్‌పాల్‌ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్‌పాల్‌ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను యునెస్కో ఆయనకు కళింగ ప్రైజ్‌’ను ప్రదానం చేసింది.
NCERT- National Council Of Educational Research And Training 

views: 1036

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams