Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌కు మరో 2.25 లక్షల ఇళ్లు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్‌కు మరో రూ.2,25,245 ఇళ్లను మంజూరు చేసింది. రూ.14,140 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,378 కోట్లు ఇస్తుంది. ఇందులో 1,66,296 ఇళ్లు అందుబాటు ధరల్లో (అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రోగ్రాం), 58,949 ఇళ్లను లబ్ధిదారులే నిర్మాణం చేపట్టే (బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) కార్యక్రమాల కింద కేటాయించారు. ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1,95,067 ఇళ్లు మంజూరు చేసింది. తాజా కేటాయింపుతో మొత్తం ఇళ్ల సంఖ్య 4,20,312కి చేరింది. 
views: 1185

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams