Current Affairs Telugu Daily

వరంగల్‌, మహబూబ్‌నగర్‌లలో కేంద్రీకృత భోజనం విస్తరణ
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కేంద్రీకృత వంట ద్వారా సరఫరా చేసే పథకాన్ని మరో రెండు జిల్లాలకు విస్తరించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌ జిల్లా అంతటా, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అక్షయపాత్ర, నాంది ఫౌండేషన్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు పథకం కింద భోజనం సరఫరా చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీన్ని విస్తరించుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరంగల్‌ నగరంతోపాటు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పాఠశాలకు కూడా భోజనం సరఫరా చేసే బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. 
views: 1234

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams