Current Affairs Telugu Daily

కొత్త సన్‌ఫిష్‌ జాతి హుడ్‌వింకర్‌ సన్‌ఫిష్‌
భారీ ఓషన్‌ సన్‌ఫిష్‌ సముద్ర జీవుల్లో ఒక కొత్త జాతిని పరిశోధకులు గుర్తించారు. దీని బరువు రెండు టన్నుల మేర ఉంది. మూడు శతాబ్దాల పాటు ఇది అందరి కళ్లను కప్పింది. ఎముకలు కలిగిన చేపల్లో.. ఓషన్‌ సన్‌ఫిష్‌లే పెద్దవి. వీటిలో కొన్ని రకాల చేపలు రెండు టన్నుల కన్నా ఎక్కువ బరువును, మూడు మీటర్ల మేర పొడవును కలిగి ఉంటాయి. కొత్తగా గుర్తించిన జాతికి ‘హుడ్‌వింకర్‌ సన్‌ఫిష్‌’ అని పేరుపెట్టారు. ఇది కూడా ఇతర సన్‌ఫిష్‌ పరిమాణంలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్‌ విశ్వవిద్యాయాలనికి చెందిన మరియానే నైగార్డ్‌ నేతృత్వంలోని పరిశోధకు బృందం దీన్ని గుర్తించింది. 
views: 966

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams