Current Affairs Telugu Daily

మహిళా ఉద్యోగుల వేధింపులపై ఫిర్యాదులకు ఆన్‌లైన్‌ వేదిక షి-బాక్స్‌
పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ వేదికను 2017 జులై 24న ఆవిష్కరించింది. షి-బాక్స్‌ (లైంగిక వేధింపుల ఎలక్ట్రానిక్స్‌ బాక్స్‌) పేరుతో ఏర్పాటైన ఈ వ్యవస్థ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. షి-బాక్స్‌ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం-2013 ప్రభావవంతంగా అమలయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది.
కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి - మేనకాగాంధీ

views: 984

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams