Current Affairs Telugu Daily

వివాదాస్పద యోంగ్‌జింగ్‌ దీవిలో చైనా సినిమా హాలు ప్రారంభం
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని యోంగ్‌జింగ్‌ దీవిలో చైనా ఆధునిక సినిమా థియేటర్‌ను ప్రారంభించింది. శాన్షా పురపాలక సంఘం పరిధిలో శాన్షా యింగ్‌లోంగ్‌ సినిమా పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది. 2017 జులై 22న ద ఎటర్నిటీ ఆఫ్‌ జయో యులు అనే చైనా సినిమాను మొదటిసారి ప్రదర్శించింది. ఈ సముద్రంపై తమకు కూడా హక్కులు ఉన్నాయని పొరుగుదేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రూనై, తైవాన్‌లు చెబుతుండడంతో తన ఆధిపత్యాన్ని పదర్శించుకోవడానికి  చైనా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది.
views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams