Current Affairs Telugu Daily

2014 నుంచి లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు
2014 ఏప్రిల్‌ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాలు, స్వాధీనం, సర్వేల్లో రూ.71,941 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నోట్ల రద్దు సమయమైన 2016 నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు రూ.5,400 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బహిర్గతమైనట్టు వెల్లడించింది. 303.367 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams