Current Affairs Telugu Daily

2016 ఉగ్ర దాడుల్లో భారత్‌కు 3వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా 2016లో ఉగ్రదాడులు అధికంగా జరిగిన దేశాల్లో భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాదంపై రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ జాబితాలో ఇరాక్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత్‌లో జరిగిన దాడుల్లో 93శాతం ఒక్క జమ్మూ కశ్మీర్‌లో జరిగినట్టు ప్రకటించింది. 2016లో సగటున ఉగ్రదాడికి భారత్‌లో 0.4 మరణాలు సంభవించగా ప్రపంచవ్యాప్తంగా ఇది 2.4గా ఉంది. ఈ జాబితాలో భారత్‌ కంటే పాకిస్తాన్‌ మెరుగైన స్థానంలో ఉంది. 2016లో ప్రపంచం మొత్తం మీద 11,072 ఉగ్రదాడులు  జరిగాయి. 104 ఉగ్రపీడిత దేశాల్లో జరిగిన దాడుల్లో 55 శాతం దాడులు  ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌, ఇండియా, పాకిస్తాన్‌లోనే జరిగినట్లు వెల్లడించింది.
-ప్రమాదకర ఉగ్రవాద జాబితాలో నక్సలిజంను చేర్చింది. 
- అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన ఐసిస్‌, తాలిబన్‌ తర్వాత నక్సలిజం ద్వారా ఎక్కువ దాడులు జరిగినట్టు తెలిపింది.
జాబితా
ర్యాంక్‌       దేశం          ఉగ్రదాడులు
1    ఇరాక్‌    2965
2    ఆప్ఘనిస్థాన్‌    1340
3    భారత్‌    927
4    పాకిస్థాన్‌    734

views: 1125

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams