Current Affairs Telugu Daily

ఏంజెల్‌ రేణువు ఆచూకీ లభ్యం
పదార్థ, వ్యతిరేక పదార్థ లక్షణాలను కలిగిన ఒక ఏంజెల్‌ రేణువును అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాయానికి చెందిన షౌచెంగ్‌ జాంగ్‌ బృందం శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విప్లవాన్ని సాకారం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుత పరిజ్ఞానంతో పోలిస్తే చాలా శక్తిమంతమైన యంత్రాలను రూపొందించడానికి వీలవుతుంది. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్‌ సమయంలో పదార్థం (మ్యాటర్‌), వ్యతిరేక పదార్థం (యాంటీ మ్యాటర్‌) సమాన స్థాయిలో ఉత్పత్తయిందని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. రెండు పదార్థాలు కలుసుకుంటే అవి పరస్పరం నాశనం చేసుకుంటాయి. తమలోనే వ్యతిరేక రేణువులను కలిగిన ఒక కొత్త తరగతి రేణువులు కూడా ఉండొచ్చని 1937లో ఇటలీ భౌతిక శాస్త్రవేత్త ఎటోర్‌ మాజోరానా ప్రతిపాదించారు. వీటికి ఫెర్మియాన్లని పేరు పెట్టారు. వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఫెర్మియాన్‌ ఉనికిని తెలిపే క్వాసీ రేణువుల ఆచూకీని కనుగొన్నారు. దీనికి దేవదూత రేణువు (ఏంజిల్‌ పార్టికిల్‌)గా పేరు పెట్టారు. దీనిలో పదార్థ, వ్యతిరేక పదార్థ లక్షణాలు ఉన్నాయి. దీంతో ప్రాథమిక భౌతిక శాస్త్రంలో అత్యంత విస్తృతంగా సాగిన ఒక అన్వేషణకు ముగింపు పడినట్లయింది. ఫెర్మియాన్లు ఉనికిలో ఉంటే క్వాంటమ్‌ కంప్యూటర్ల నిర్మాణం వీలవుతుంది.
views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams