Current Affairs Telugu Daily

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తింపునకు కృత్రిమ మేధ
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఏ దశలో ఉందో కచ్చితంగా, త్వరితంగా అంచనావేసే కృత్రిమ మేధను కోల్‌కతాలోని ఖరగ్‌పూర్‌ ఐఐటీ, టాటా వైద్య కేంద్రం పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ప్రయోగాత్మక పరిశీలనలో ఈ సాఫ్ట్‌వేర్‌ 90 శాతం కచ్చితమైన ఫలితాలిచ్చిందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ ఏ దశలో ఉందో గుర్తించేందుకు కేఐ-67 అనే ప్రొటీన్‌ను వినియోగిస్తున్నారు. కృత్రిమ మేధ కూడా క్యాన్సర్‌ కణాల పెరుగుదల శాతాన్ని గుర్తించి కేఐ-67 స్కోర్‌ను కచ్చితంగా లెక్కకడుతుంది. క్యాన్సర్‌ నిర్థారణకు జీవధాతు (బయోప్సీ) పరీక్ష కోసం తీసుకునే నమూనాలో కొంత భాగాన్ని ఫొటో తీసి కంప్యూటర్‌లో పెడితే ఈ కృత్రిమ మేధ క్యాన్సర్‌ ఏ స్థాయిలో ఉందో చెబుతుంది.
views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams