Current Affairs Telugu Daily

స్వదేశీ సూపర్‌ కంప్యూటర్ల తయారీకి నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌
భారత్‌లో తయారీ కింద దేశీయంగా సూపర్‌ కంప్యూటర్లను తయారు చేయడం కొరకు కేంద్రం ‘నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌’ (NSM) పేరుతో మూడంచెల కార్యక్రమాన్ని రూపొందించింది. రూ.4500 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద మూడు దశల్లో దాదాపు 50 సూపర్‌ కంప్యూటర్లను రూపొందించనున్నారు. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధన కేంద్రాలకు అందిస్తారు. ఈ వ్యవహారాన్ని పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) సంస్థ పర్యవేక్షిస్తోంది. 
- మొదటి దశలో 6 సూపర్‌ కంప్యూటర్లు సిద్ధమవుతాయి. ఇందులో మొదటి మూడింటిని నేరుగా దిగుమతి చేసుకుంటారు. మిగతావాటికి సంబంధించిన విడిభాగాలు  విదేశాల్లోనే తయారైనా, కూర్పు మాత్రం భారత్‌లో జరుగుతుంది. 
- మొదటి దశలోని 2 కంప్యూటర్లకు గరిష్ట సామర్థ్యం 2 పెటా ఫ్లాప్స్‌ చొప్పున ఉంటుంది. మిగతావాటికి 500 టెరా ఫ్లాప్స్‌ ఉంటుంది. 
- కంప్యూటర్‌ గణన సామర్థ్యాన్ని ‘ఫ్లోటింగ్‌ పాయింట్‌ ఆపరేషన్స్‌ పర్‌ సెకండ్‌’ (ఫ్లాప్స్‌)లో కొలుస్తారు. 
- ఒక సెకనుకు వెయ్యి లక్షల కోట్ల ఆపరేషన్లను నిర్వహించగలిగితే దాన్ని పెటా ఫ్లాప్‌ అంటారు
- ఒక సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లను చేపట్టే సామర్థ్యాన్ని టెరా ఫ్లాప్‌గా అంటారు. 
- భారత్‌ 1988లో సొంతంగా సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ను ప్రారంభించింది. 
- మొదట పరమ్‌ శ్రేణి సూపర్‌ కంప్యూటర్లను రూపొందించింది. ఈ కార్యక్రమం 10 సం॥ల పాటు కొనసాగింది. 
- 2000 సంవత్సరం తర్వాత కొత్తగా ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. 
- ప్రస్తుతం సూపర్‌ కంప్యూటర్లలో అమెరికా, జపాన్‌, చైనా, యురోపియన్‌ యూనియన్‌ ప్రధాన వాటాను ఆక్రమించాయి. 
- నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్స్‌ మిషన్‌ ప్రాజెక్టుతో భారత్‌ కూడా వీటి సరసన చేరుతుంది. 
- ప్రస్తుతం భారతదేశంలో 25 సూపర్‌ కంప్యూటర్లు ఉన్నాయి. వాటిని వాతావరణం, వాతావరణ మార్పులు, అణు చర్యలు వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు.
NSM-National Supercomputing Mission

views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams