Current Affairs Telugu Daily

డిసెంబర్‌లో చంద్రుడి పైకి టీం ఇండస్‌ సంస్థ వ్యోమనౌక
బెంగళూరుకు చెందిన టీం ఇండస్‌ సంస్థ 2017 డిసెంబర్‌లో చందమామ పైకి వ్యోమనౌకను పంపనుంది. దీంతో ఆ ఘనతను సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా అవతరిస్తుంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. 
- ఇస్రో మాజీ శాస్త్రవేత్త మార్గదర్శకత్వంలో టీం ఇండస్‌కు చెందిన 100 మంది ఇంజినీర్లు 600 కిలో వ్యోమనౌకను, ‘ఎక్‌ చోటీ సీ ఆశ’ అనే 6 కిలోల రోవర్‌ను నిర్మించారు.
- ఈసీఏతోపాటు జపాన్‌కు చెందిన మరో బృందం నిర్మించిన రోవర్‌ను కూడా ఈ వ్యోమనౌకలో ఉంచుతారు. ఫ్రాన్స్‌ అంతరిక్ష సంస్థ కెమెరానూ మోసుకెళుతోంది.
- ఈ వ్యోమనౌక చంద్రుడిపై ‘మేర్‌ ఇంబ్రియం’ అనే ప్రదేశంలో దిగుతుంది. రష్యా, చైనాు కూడా గతంలో ఈ ప్రాంతంలోనే తమ వ్యోమనౌకను దించాయి.

views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams