Current Affairs Telugu Daily

రాష్ట్ర భూసేకరణ సవరణ చట్టం పరిధిలోకి మరో 4 ప్రాజెక్టులు
భూసేకరణ, పునరావాసం, న్యాయబద్ధమైన నష్టపరిహారం, పారదర్శకత హక్కుల చట్టం-2013కు బదులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన సవరణ చట్టం-2016 కింద మరో 4 ప్రాజెక్టులను చేర్చింది. దీని ప్రకారం సామాజిక ప్రభావం మరియు ప్రజాప్రయోజనం నిర్ధారణ(చాప్టర్‌-2), ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధన(చాప్టర్‌-3)ను మినహాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. ఈ మేరకు నీటిపారుదశాఖ 2017 జులై 22న ఆదేశాలు జారీ చేసింది. ఎస్సారెస్పీ పరిధిలోని ఇందిరమ్మ వరద కాల్వ  ప్రాజెక్టు, జవహర్‌ నెట్టెంపాడు, సబర్మట్‌ బ్యారేజీ, రోళ్లవాగు చెరువు ప్రాజెక్టుకు రాష్ట్ర చట్టం మేరకు చర్యలు చేపట్టనున్నారు.
views: 1212



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams