Current Affairs Telugu Daily

బాలాజీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై SEBI నిషేధం
కేపిటల్‌ మార్కెట్లలో పాల్గొనకుండా శ్రీ బాలాజీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై SEBI 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. కంపెనీ యజమాని మనక్‌లాల్‌ పాన్‌పాలియా, సంజయ్‌ రాఠిలకు కూడా నిషేధాన్ని వర్తింపజేసింది. ట్రేడింగ్‌, సెటిల్‌మెంట్‌ లావాదేవీల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు ఈ చర్యను SEBI తీసుకుంది. 2011 జూన్‌లో ఏంజెల్‌ బ్రోకింగ్‌కు అధికారిక మార్కెట్‌ లావాదేవీల ప్రతినిధిగా బాలాజీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గుర్తింపు పొందింది. డబ్బా ట్రేడింగ్‌ చేయడం ద్వారా ఆ గుర్తింపు హోదాను కంపెనీ దుర్వినియోగం పర్చిందని SEBI దర్యాప్తులో తేలడంతో నిషేధం విధించింది.
SEBI-Securities and Exchange Board of India

views: 1091

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams