Current Affairs Telugu Daily

టాప్-10 HIV బాధిత దేశాల్లో  భారత్‌, పాక్‌
2016లో ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో  95 శాతానికి పైగా కొత్త హెచ్‌ఐవీ బాధితులున్న 10 దేశాల్లో చైనా, భారత్‌, పాక్‌లు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. మిగతా దేశాల్లో ఇండొనేసియా, వియాత్నాం, మయన్మార్‌, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, మలేసియాలున్నాయి. 
- గత 6 సంవత్సరాలలో  ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో కొత్త హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 13 శాతం తగ్గింది. 2010లో 3.10 లక్షల బాధితులుండగా ఆ సంఖ్య 2016 నాటికి 2.70 లక్షలకు తగ్గింది.
- భారత్‌లోని 26 నగరాల్లో నమూనా సర్వే జరపగా హెచ్‌ఐవీ సోకిన వారిలో 41 శాతం మందికి వైరస్‌ పరిస్థితి తెలుసని తేలింది. వీరిలో 52 శాతం మంది చికిత్స (యాంటీ రిట్రోవైరల్‌) తీసుకుంటుండగా, ఇందులో 83 శాతం బాధితుల్లో వైరస్‌ నియంత్రణలో ఉంది.
HIV-Human Immunodeficiency Virus 

views: 1589

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams