Current Affairs Telugu Daily

సింగరేణికి ఎక్సలెన్స్‌ ఇన్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ - 2018 అవార్డు 
హైదరాబాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రతిభ కనబరిచిన సంస్థలకిచ్చే ఎక్సలెన్స్‌ ఇన్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ - 2018 అవార్డు సింగరేణి సంస్థలకు లభించింది. 2017 జులై 18న న్యూఢిల్లీలో జరిగిన 14వ జాతీయ స్థాయి అవార్డు ఉత్సవంలో కేంద్ర విద్యుత్‌, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అవార్డును స్వీక రించారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ సంస్థ దేశం లోని పరిశ్రమలు, సంస్థలు వ్యయ (కాస్ట్‌) వ్యవహారాలు నిర్వహించుకోవడానికి నిర్దిష్టమైన సూచనలు, నిబంధనలు రూపొందించి, అమలు చేయాలని సూచిస్తుంది. ఈ నిబంధనను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నందుకు సింగరేణికి ఈ అవార్డు లభించింది. సింగరేణికి 2015లో కూడా ఈ అవార్డు లభించింది.
views: 1164

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams