Current Affairs Telugu Daily

డోప్‌ పరీక్షలో మన్‌ప్రీత్‌ కౌర్‌ విఫలం 
స్వదేశంలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిలో దేశానికి తొలి స్వర్ణం అందించిన మన్‌ప్రీత్‌ కౌర్‌ జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోప్‌ పరీక్షలో ఆమె విఫలమైంది. నిషేధిత ఉత్ప్రేరకం డైమిథైల్‌ బ్యుటైమైన్‌ను మన్‌ప్రీత్‌ తీసుకున్నట్లు తేలింది. 
2017 జూన్‌ తొలి వారంలో ఫెడరేషన్‌ కప్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా సేకరించిన ‘ఎ’ శాంపిల్‌ను పరీక్షించగా ఆమె డోపీగా తేలింది. ‘బి’ శాంపిల్‌ పరీక్షలోనూ విఫలమైతే ఆసియా అథ్లెటిక్స్‌ షాట్‌ పుట్‌లో మన్‌ప్రీత్‌ గెలిచిన పసిడిని భారత్‌ కోల్పోతుంది. ఆమె తీసుకున్న ఉత్ప్రేరకాన్ని గతంలో భారత అథ్లెట్లు ఎవరూ ఉపయోగించలేదని సమాచారం. 

views: 1041

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams