Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే అత్యధిక సంపాదనపరుడైన షట్లర్‌ శ్రీకాంత్‌ 
భారత స్టార్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ 2017లో ప్రపంచంలోనే అత్యధిక సంపాదనపరుడైన షట్లర్‌గా నిలిచాడు. టోర్నీల ద్వారా లభించిన ఆదాయంలో శ్రీకాంతే నంబర్‌వన్‌ అని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. ఈ విషయంలో మహిళ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సహా అగ్రశ్రేణి క్రీడాకారుల్ని శ్రీకాంత్‌ అధిగమించినట్లు పేర్కొంది. 
- సింగపూర్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా, ఇండోనేసియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్‌ ఈ ఏడాది ప్రైజ్‌మనీ ద్వారా సుమారు రూ.94.31 లక్షలు సంపాదించాడు. 
- ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్న లీ చాంగ్‌ వీ (రూ.45.48 లక్షలు) కంటే శ్రీకాంత్‌ ఆదాయం రెట్టింపు
- లిన్‌ డాన్‌ (రూ.44.52 లక్షలు) 3వ స్థానంలో ఉన్నాడు. 
- మహిళల జాబితాలో పి.వి.సింధు రూ.30.03 లక్షలతో 7వ స్థానంలో ఉంది.

views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams