Current Affairs Telugu Daily

తొలి రోబో ఒలింపియాడ్‌లో భారతీయులకు 2 అవార్డులు
అమెరికాలో నిర్వహించిన తొలి రోబోటిక్‌ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం 2 అవార్డులుగెలుచుకొంది. వాషింగ్టన్‌లో 2017 జులైలో మూడు రోజులపాటు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాలుపంచుకొన్నారు. ముంబయికి చెందిన 15 సం॥ల రాకేశ్‌ నేతృత్వంలోని బృందం వీటికి హాజరైంది. విద్యార్థుల ఆదివ్‌ షా, హరీశ్‌ భట్‌, వాట్సిన్‌, ఆధ్యన్‌, తేజస్‌, రాఘమ్‌ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు అభివృద్ధి చేసిన షెంగ్‌ హెంగ్‌ ఇంజినీరింగ్‌ డిజైన్‌లకు బంగారు పతకం, గ్లోబల్‌ ఛాలెంజ్‌ మ్యాచ్‌ డిజైన్‌కు కాంస్య పతకం వచ్చాయి. విజేతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ కలిశారు. 2018లో ఈ పోటీలు మెక్సికో సిటీలో జరుగనున్నాయి.
views: 1059

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams