Current Affairs Telugu Daily

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా టి.ఆర్‌.జెలియాంగ్‌ 
నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా టి.ఆర్‌.జెలియాంగ్‌ మరోసారి బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌ పి.బి.ఆచార్య 2017 జులై 19న ఆయనను నియమించారు. జులై 22లోగా బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గడువిచ్చారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో జెలియాంగ్‌ 5 నెలల క్రితమే ఆ పదవికి రాజీనామా చేయడంతో షుర్హోజెలీ లీజీత్సు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. జెలియాంగ్‌ అధికార నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందినవారు. జెలియాంగ్‌ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆయన్ను పార్టీ నుంచి ఎన్పీఎఫ్‌ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు  పాల్పడుతున్నారని ఆరోపించింది. 
- పురపాలక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించడంపై ఆందోళనలు చెలరేగడంతో 2017 ఫిబ్రవరిలో జెలియాండ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.

views: 1024

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams