Current Affairs Telugu Daily

ఉగ్రవాదుల ఆశ్రయ దేశాల జాబితాలో పాకిస్థాన్‌
పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందని అమెరికా 2017 జులై 19న స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దేశాలు, ప్రాంతాల జాబితాలో పాక్‌ను చేర్చింది. లష్కరే తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ వంటి సంస్థలు గత ఏడాది కూడా పాక్‌లో కార్యకలాపాలు నిర్వహించాయని, శిక్షణ అందించాయని, నిధులు సేకరించాయని తెలిపింది. ఉగ్రవాదంపై కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాలను వెల్లడించింది. ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా అఫ్గానిస్థాన్‌, సోమాలియా, ట్రాన్స్‌-సహారా, సు/సువేసి సీస్‌ లిట్టోరల్‌, దక్షిణ ఫిలిప్పీన్స్‌, ఈజిప్టు, ఇరాక్‌, లెబనాన్‌, లిబియా, యెమెన్‌, వెనెజువెయిలా, కొలంబియానూ పేర్కొంది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశాల జాబితాలో ఇరాన్‌, సుడాన్‌, సిరియాలను చేర్చింది. గడిచిన పలు దశాబ్దాలుగా ఈ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
- అఫ్గాన్‌ తాలిబన్‌ లేదా హక్కానీ నెట్‌వర్క్‌, లష్కరే తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ తదితర ఉగ్ర సంస్థలపైనా తగినంత చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. 
- లష్కరే తోయిబాను నిషేధించినా దాని అనుబంధ సంస్థలైన జమాత్‌ ఉద్‌ దవా, ఫలా ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌లు బహిరంగంగానే నిధులను సేకరిస్తున్నాయని పేర్కొంది. 
- ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన లష్కరే తోయిబా అధిపతి హఫీజ్‌ సయీద్‌ 2017 ఫిబ్రవరిలోనూ పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించాడని తెలిపింది. 
- అల్‌ఖైదా, ఐసిస్‌, జైష్‌ ఎ మహ్మద్‌, లష్కరే తోయిబా, డి-కంపెనీ(దావూద్‌ ఇబ్రహీం గ్రూప్‌) వంటి వాటి నుంచి ఎదురయ్యే ఉగ్రవాద ముప్పునకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్‌, అమెరికా ప్రతినబూనాయని వెల్లడించింది. 
- జైష్‌ ఎ మహ్మద్‌ నేత మౌలానా మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ భారత్‌, అమెరికాలు కలిసికట్టుగా కృషి చేశాయలని తెలిపింది. 
- భారత్‌లో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులతో పాటు మావోయిస్టు దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఐసిస్‌ లాంటి 
- అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి ఎదురయ్యే ముప్పును భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. 
- ఐసిస్‌కు అనుబంధంగా నియమితులవుతున్న పలువురిని భారత్‌ అరెస్టు చేసిందని పేర్కొంది.

views: 941

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams