Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాల విలువ 10% పెంపు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పూరి గుడిసె నుంచి ఆకాశ హర్మ్యాల వరకూ మార్కెట్‌ విలువలు పెంచారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని తరహా నిర్మాణాల విలువలు 10% వరకు పెరుగుతున్నాయి. ఈ మేరకు స్టాంపు, రిజిస్ట్రేషన్‌ శాఖ 2017 జులై 19న ఆదేశాలు జారీ చేసింది. 2017 ఆగస్టు 1 నుంచి కొత్త విలువలు అమలులోకి వస్తాయి. 
- నిర్మాణాలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ చదరపు అడుగుల ఒక్కింటికీ రూ.890గా మార్కెట్‌ విలువ ఉంది. దానిని రూ.980కి పెంచారు. 
- అంతస్తుల వారీగా, కార్‌ పార్కింగ్‌కి సంబంధించి కూడా సవరించారు. 
- పూరి గుడిసెకు పట్టణాల్లో చ.అడుగుకి రూ.150, మేజర్‌ పంచాయతీల్లో రూ.100, చిన్న పంచాయతీల్లో రూ.80గా నిర్ణయించారు.

views: 1159

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams