Current Affairs Telugu Daily

నాగార్జునసాగర్‌ జలాశయంలో అరుదైన మత్స్య సంపద..పంగాసీయస్‌ సైలాసీ
నాగార్జునసాగర్‌ జలాశయంలో అరుదైన మత్స్య సంపద లభ్యమవుతుంది. సాగర్‌ జలాశయంలో పంగాసీయస్‌ సైలాసీ(పలుపు జల్ల)అనే మేలు రకానికి చెందిన చేప సంతతి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని అధికారులు వెల్లడించారు. ఈ చేప జాతి అభివృద్ధి కోసం సాగర్‌ సమీపంలోనే హెక్టారు విస్తీర్ణంలో చేప చెరువు వేసి పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను చెన్నై ఐసీఆర్‌కు చెందిన శాస్త్రవేత్త అజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు పైలట్‌ ప్రాజెక్టును నిర్వహించడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ చేపలను సజీవంగా తమకు అందజేస్తే మత్స్య కార్మికులకు తగిన ధరను చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు. 
views: 1120

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams