Current Affairs Telugu Daily

యూజీసీ ఆన్‌లైన్‌ విద్య నిబంధనావళి- 2017
యూజీసీ ఆన్‌లైన్‌ విద్య నిబంధనావళి- 2017 పేరిట ముసాయిదా నివేదికను వెలువరించింది. ఈ నివేదికలో సంప్రదాయ డిగ్రీ, డిప్లొమా కోర్సును ఆన్‌లైన్‌లోనూ పూర్తిచేయవచ్చని పేర్కొంది. కేవలం న్యాక్‌ గ్రేడ్‌ ఉన్న విశ్వవిద్యాలయాలే ఆన్‌లైన్‌ కోర్సులను అందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ కోర్సులున్నా అవి కేవలం సర్టిఫికెట్‌ కోర్సు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు స్వల్పకాలిక కోర్సు మాత్రమే. వాటిని చాలా ప్రైవేట్‌ సంస్థలు కూడా అందించేవి. వాటికి యూజీసీ నుంచి గుర్తింపు ఉండదు. ఇక మీదట ఆన్‌లైన్‌లో కోర్సు చేసినా యూజీసీ గుర్తింపు ఉంటుంది. ఇంజినీరింగ్‌, వైద్య, డెంటల్‌, ఫార్మసీ, నర్సింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఫిజియోథెరపీతోపాటు ఆన్‌లైన్‌ విధానంలో అందించేందుకు వివిధ నియంత్రణ సంస్థలు అనుమతి ఇవ్వని కోర్సును ఇక మీదటా అందించడానికి వీలుకాదని యూజీసీ తేల్చి చెప్పింది. గెజిట్‌ ప్రచురించిన నాటి నుంచి ఈ నిబంధను అమలులోకి వస్తాయి.
యూజీసీ - విశ్వవిద్యాలయాల నిధుల సంఘం

views: 863

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams