ఐసీడబ్ల్యూఎఫ్ మార్గదర్శకాల పరిధిని పెంచిన కేంద్ర మంత్రివర్గం
భారత సమాజ సంక్షేమ నిధి (ఐసీడబ్ల్యూఎఫ్) పరిధిని పెంచేందుకు సంబంధిత మార్గదర్శకాల సవరణకు కేంద్ర కేబినెట్ 2017 జులై 19న అనుమతి ఇచ్చింది. ప్రవాస భారతీయులు సహకారం కోసం చేసే విజ్ఞప్తులను వేగంగా పరిశీలించేలా విదేశాల్లోని భారత రాయబార కార్యాయాలకు ఈ మార్గదర్శకాలు మరింత వెసులుబాటును కల్పిస్తాయి.
- ఐసీడబ్య్యూఎఫ్ను 2009లో ఏర్పాటు చేశారు
- యుద్ధ సంక్షుభిత ప్రాంతాలైన లిబియా, ఇరాక్, యెమెన్, దక్షిణ సూడాన్ దేశాల నుంచి భారతీయులను అత్యవసరంగా తరలించేందుకు ఐసీడబ్ల్యూఎఫ్ ఎంతో ఉపయుక్తంగా పని చేసింది.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
- ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ కేడర్ సమీక్షకు ఆమోదం
- జమ్ముకశ్మీరులో వస్తు, సేవల కేంద్ర పన్ను కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం
- పన్నుల వ్యవహారమై బ్రిక్స్ దేశాలతో సహకార ఒప్పందానికి ఆమోదం.
- భారత్‌నెట్ ప్రాజెక్టుకు ఉద్దేశించిన సవరించిన అమలు వ్యూహానికి ఆమోదం. 2019 నాటికి అన్ని పంచాయతీలకూ బ్రాడ్‌బాండ్ సౌకర్యం కల్పించాన్నది ఈ పలుథకం ఆశయం.
- భారత అంతర్గత జల రవాణా ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యుఏఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ.600 కోట్ల సమీకరణకు అంగీకారం
views: 968