Current Affairs Telugu Daily

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన నిషేధం ఎత్తివేత
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విధించిన విమానయాన నిషేధాన్ని ఇండిగో, ఎయిర్‌ ఇండియాలు 2017 జులై 19న ఎత్తివేశాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణతో జేసీ దివాకర్‌రెడ్డిపై 2017 జూన్‌ 15న ఇండిగో, ఇతర విమానయాన సంస్థలు ప్రయాణ నిషేధాన్ని విధించాయి. నిషేధం కారణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి జేసీ రూ. 6 లక్షలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. 
- ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై కూడా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నిషేధం విధించి 2017 ఏప్రిల్‌ 9న ఎత్తివేసింది.

views: 926

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams