Current Affairs Telugu Daily

పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితా
పెట్టుబడులకు అనువుగా ఉండే రాష్ట్రాల జాబితాను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌(NCAER) తన నివేదికలో ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు ముందు నిలిచాయి. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతా(డిల్లీ) జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు వరుసగా 3, 5 స్థానాలు లభించాయి. గుజరాత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2016 జాబితాతో పోలిస్తే గుజరాత్‌, డిల్లీలు తిరిగి అదే స్థానాలను నిబెట్టుకోగా.. హర్యానా, తెలంగాణలు చాలా వేగంగా టాప్‌-5లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూముల వంటి 6 ముఖ్యాంశాలు, 51 ఉప-అంశాలను బేరీజు వేసి వీటిని నిర్ణయించింది. 
పెట్టుబడులకు అనువైన టాప్‌-10 రాష్ట్రాలు
1    గుజరాత్‌
2    డిల్లీ
3    ఆంధ్రప్రదేశ్‌
4    హర్యానా
5    తెలంగాణ
6    తమిళనాడు
7    కేరళ
8    మహారాష్ట్ర
9    కర్ణాటక
10    మధ్యప్రదేశ్‌ 
- ఆర్థిక వాతావరణం     - గుజరాత్‌ 
- మౌలిక సదుపాయాల కల్పన     - డిల్లీ
- కార్మిక సమస్య పరిష్కారం     - తమిళనాడు
- భూముల విషయం    - మధ్యప్రదేశ్‌
-NCAER డైరెక్టర్‌ జనరల్‌     : శేఖర్‌ షా 
NCAER-National Council of Applied Economic Research

views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams