Event-Date: | 21-Nov-2019 |
Level: | National |
Topic: | Awards and honours |
వైఫై సౌకర్యం లో రెండవ స్థానంలో దక్షిణ మధ్య రైల్వే
*డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఉచిత వైఫై సౌకర్యం కల్పించిన జోన్లలో దక్షిణమధ్య రైల్వే దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.
*ప్రస్తుతం జోన్‌లోని 574 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది.
* డిజిటల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వేలోని అన్ని స్టేషన్లలో (హాల్ట్ స్టేషన్లు మినహా) ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
*2015లో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యం ప్రారంభమైంది.
*నాలుగు సంవత్సరాల కాలంలో ఈ సౌకర్యం 574 స్టేషన్లకు విస్తరించింది.
* రైల్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ అయిన రైల్‌వైర్ బ్రాండ్ ప్రొవైడర్‌తో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు.