Current Affairs Telugu Daily

తిరుగులేని ఓపెనర్ కు అరుదైన గౌరవం 

*టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది.ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ క్రికెట్‌ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్‌ పేరు పెట్టాలని ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) నిర్ణయించింది. 
*దానిలో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్‌ పేరును ఖరారు చేసింది.
*ఈ మేరకు డిసెంబర్ నెలలో గంభీర్‌ పేరుతో స్టాండ్‌ ఏర్పాటుకానుంది. 
* జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో ఢిల్లీ తరఫున గంభీర్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. 2018 లో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ తరఫున చివరి మ్యాచ్‌ ఆడుతూనే గంభీర్‌ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. 
*1999 సీజన్‌లో గంభీర్‌ రంజీ ట్రోఫీ అరంగేట్రాన్ని ఢిల్లీ తరఫున ఆరంభించారు. 
*2007-08 సీజన్‌లో అతని సారథ్యంలోని ఢిల్లీ రంజీ ట్రోఫీ అందుకుంది.
*టీమిండియాలో తిరుగులేని ఓపెనర్‌గా గంభీర్‌ రాణించారు.
*  భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈస్ట్‌ దిల్లీకి ఎంపీగా ఉన్నారు.


views: 686Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams