Current Affairs Telugu Daily

కెనడా మంత్రివర్గంలో తొలి హిందూ మహిళ

*కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్‌ చోటుదక్కించుకున్నారు.
*కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. 
*ఇటీవల ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
*  అక్టోబర్‌లో జరిగిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభకు ఆమె అర్హత సాధించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్‌గా కూడా అనిత ప్రత్యేక గుర్తింపును పొందారు. 
*ఈమె  టొరంటోలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు  నిర్వహిస్తున్నారు.
* తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. 
*అనిత తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు 
*నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారికి కూడా ట్రూడో చోటుకల్పించారు. వీరంతా ఇండో-కెడియన్‌కు చెందిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు.
*కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం . ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం. దక్షిణములో మరియు వాయుమ్వంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.

*కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
*మొత్తం 388 సీట్లుకు లిబరల్స్‌ 156 స్థానాలు దక్కించుకోగా  ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్‌ 122 సాధించింది. 
*ప్రవాస భారతీయుడు జగ్మీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23స్థానాలు గెలిచింది. 
*కెనడాలో మెజార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 170 స్థానాలు అవసరం.చిన్న పార్టీలతో కలిసి ట్రూడో మైనార్టీ ప్రభుత్వాన్ని నడపనున్నారు. 
*లిబరల్ పార్టీ - 156 స్థానాలు, కన్సర్వేటీవ్స్‌ - 122 స్థానాలు,న్యూ డెమొక్రటిక్ పార్టీ -23 స్థానాలు. 


views: 676



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams