Current Affairs Telugu Daily

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీ

కులం, మతం తేడా లేకుండా భారత దేశమంతా పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్సీ) ప్రక్రియ చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు.
*అసోంతో సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీ అమలవుతుంది. అన్ని మతాల వారికీ ఇది వర్తించనుంది .
* అలాగే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన అణచివేత, ఘర్షణల వల్ల ఇక్కడికొచ్చిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీ శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తారు.ఇది పౌరసత్వ చట్టసవరణ బిల్లు ప్రకారం జరగబోతుంది.
*లోక్‌సభ ఆమోదించిన పౌరసత్వ చట్ట బిల్లు ను సెలెక్ట్‌ కమిటీ అంగీకరించింది.  
*జాతీయ పౌర రిజిస్టర్‌కు, పౌరసత్వ సవరణ బిల్లుకు మధ్య తేడా ఉంది అని అమిత్ షా పేర్కొన్నారు.
* పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో మతపరమైన అరాచకాలను భరించలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారికి జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కింద పౌరసత్వం కల్పిస్తారు.
* దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని ఏరివేసి, నిజమైన పౌరులను గుర్తించేందుకు చేపట్టిందే జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్సీ) ప్రక్రియ ఎన్‌ఆర్సీ .
*దేశంలో 1951లో తొలిసారి ఎన్‌ఆర్సీ జరిగింది. తర్వాత 2013లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర ప్రభు త్వం అసోంలో ఎన్‌ఆర్సీ నిర్వహించింది. 
*అసోం జనాభా 3.3 కోట్లు. వారిలో 19 లక్షల మంది విదేశీయులు ఉన్నట్టు ఈ గణన ద్వారా తేలింది. 
*వారికి అనేక అంచెల్లో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. చివరి నాటికి కూడా పౌరసత్వాన్ని రుజువు చేసుకోలేకపోయిన వారిని మాత్రం విదేశీయులుగా పరిగణించి, వెనక్కి పంపించివేస్తారు.


views: 651



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams