Event-Date: | 21-Nov-2019 |
Level: | Local |
Topic: | Miscellaneous(General) |
ప్రకృతి వ్యవసాయానికి జర్మన్ బ్యాంక్ సహాయం
* ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు జర్మనీ అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణానికై గత ఏడాది జనవరిలో ప్రాథమిక ప్రాజెక్ట్ ప్రతిపాదనతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
* రాష్ట్ర ప్రభుత్వం రూ. 2వేల 479 కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్ నివేదిక పంపింది. అందులో రూ. 1735 కోట్లు కేఎఫ్‌డబ్ల్యూ రుణంగా అందించనుంది. మిగిలిన 30 శాతం రూ. 744 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది.
* కేఎఫ్‌డబ్ల్యు మొదటి దశ గ్రాంట్ కాంపొనెంట్‌తో కలిపి రూ. 694 కోట్లు, రెండో దశలో రూ. 1041 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.
*ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనల ప్రకారం రుణ మంజూరుకు సంబంధించి ఈ నెలలో కేఎఫ్‌డబ్ల్యూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంది.
* రుణ మంజూరు ఒప్పందంపై సంతకాలు పూర్తయిన అనంతరం కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ తొలి విడత నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలులో భాగంగా రాష్ట్రంలో 1725 గ్రామ పంచాయతీలకు చెందిన 7 లక్షల మంది రైతులను పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* 25 లక్షల మంది రైతులను మాస్టర్ ఫార్మర్లుగా తీర్చిదిద్ది పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా నియమిస్తారు. మరో 69వేల మందితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి ప్రకృతి సేద్యం అమలు, మానిటరింగ్ చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
*రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు టీ విజయకుమార్