Current Affairs Telugu Daily

రక్షణ బలగాల అధిపతి నియామకానికి చర్యలు 

*భారత రక్షణ రంగంలో  త్రివిధ దళాలైన సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు ఉమ్మడిగా 'రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్‌)' వచ్చే సంవత్సరం జనవరి కల్లా తొలిసారిగా నియమితులు కానున్నారు. 
*  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులను పూర్తిచేసింది. 
*రక్షణ అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలిచ్చే ఏకైక కేంద్రంగా పనిచేసే సీడీఎస్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు.
*సీడీఎస్‌ కోసం త్రివిధ దళాలు తమ దళాల్లోని అత్యంత సీనియర్‌ కమాండర్ల పేర్లను రక్షణ శాఖకు సిఫార్సు చేశారు.
* సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తొలి సీడీఎస్‌గా నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఈ ఏడాది డిసెంబరు 31న పదవీ విరమణ చేయనున్నారు.
* సీడీఎస్‌ అధికారాలు, విధివిధానాలు ఖరారుచేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయి కసరత్తును పూర్తి చేశాయి.మరో మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది.
*కార్గిల్‌ యుద్ధం అనంతరం 1999లో కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామక ప్రతిపాదన చేసింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సీడీఎస్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి, ప్రధానికి సీడీఎస్‌ సింగిల్‌ పాయింట్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు.
*ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (ఐడీఎస్‌) చీఫ్‌ పదవిని వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా మార్చనున్నారు. ప్రస్తుత ఐడీఎస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎస్‌ రాజేశ్వర్‌ను అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్న భారత ఏకైక ట్రై సర్వీస్‌ కమాండ్‌కు బదిలీ చేశారు. 
*వైస్‌ అడ్మిరల్‌ బిమల్‌ వర్మ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడుతారు. బిమల్‌ వర్మ నవంబర్ 30న రిటైర్‌ కానున్నారు. 
*త్రివిధ దళాల అధిపతులలాగే సీడీఎస్‌కు నాలుగు స్టార్‌లు ఉంటాయి. అయితే సీడీఎస్‌ 'సమానుల్లో ప్రథముడి'గా వ్యవహరిస్తారు.
* మిలిటరీలో కీలకమైన 'జాయింట్‌మ్యాన్‌షిప్‌' (దళాల మధ్య సమన్వయం, ఉమ్మడి వ్యూహం, అమలు)కు బాధ్యత వహించడంతోపాటు, దేశ రక్షణ దౌత్యం విషయంలోనూ సీడీఎస్‌ పాత్ర పోషిస్తారు.


views: 624Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams