Event-Date: | 21-Nov-2019 |
Level: | International |
Topic: | Law and order, Defence |
భారత నౌకాదళానికి అమెరికా ఆయుధాలు
*భారత నౌకాదళ అమ్ములపొది మరింత పటిష్టంకానున్నది. అమెరికా నుంచి సుమారు 13 ఎంకే-45 నావెల్ గన్స్‌ను భారత్ కొనుగోలు చేయనున్నది.
*అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూర్టీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత నౌకాదళానికి 13 ఎమ్కే45, 5 ఇంచ్/62 కేలిబర్ (మోడ్ 4) నావల్ గన్స్ అమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
*సుమారు వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో భారత్ ఆ ఆయుధాలను కొనుగోలు చేయనున్నది.
* ఆయుధాల అమ్మకం కోసం అమెరికా కాంగ్రెస్ అనుమతి ఇచ్చింది.
*5 ఇంచులు-62 క్యాలిబర్ సామర్థ్యం ఉన్న ఎంకే-45 నౌకాదళ ఆయుధాల కొనుగోలుతో భారత నౌకాదళం మరింత బలోపేతం కానున్నది. యుద్ధనౌకలు, విమానాలను ధ్వంసం చేయగల ఎంకె-45 గన్ ఆయుధ శ్రేణి భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను పెంచనుంది.
*అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్ సంస్థ వీటిని ఉత్పత్తి చేయనున్నది.
*శత్రు ఆయుధ వ్యవస్థ నుంచి ఈ నావెల్ గన్స్‌తో రక్షణ పొందే అవకాశాలు ఉన్నాయి. యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిషన్స్ సమయంలో ఎంకే-45 గన్స్ ఎంతో ఉపయోగపడుతాయి.