Current Affairs Telugu Daily

టెలికాం కంపెనీలకు కేంద్రం నుంచి ఊరట

* టెలికాం కంపెనీలకు కేంద్రం నుంచి ఊరట లభించింది.
*ఇప్పటివరకు బకాయిపడ్డ రూ.1.47లక్షల కోట్ల చెల్లింపును 2022 వరకు వాయిదా వేసింది. 
*నిర్మలా సీతారామన్ -- ఆర్థిక అస్థిరత కారణంగా ఏ కంపెనీ మూతపడ్డ వద్దు. ఏ కంపెనీ మూతపడాలని తాము కోరుకోము ,ప్రతీ కంపెనీ అభివృద్ది చెందాలనే కోరుకుంటామని  పేర్కొన్నారు.
* బకాయిల చెల్లింపును వాయిదా వేస్తున్నందునా.. సవరించిన మొత్తానికి సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాంక్ గ్యారెంటీని అందించవలసి ఉంటుంది.
* వాయిదాల చెల్లింపుకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా.. నిర్దేశించిన వడ్డీ యథాతథంగా వసూలు చేయబడుతుంది.
టెలికాం ఆపరేటర్లు దాదాపు రూ1.47లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
* లైసెన్స్ ఫీజులతో పాటు స్పెక్ట్రమ్ వినియోగానికి గాను ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
* మూడు నెలల్లోగా బకాయిలన్నీ చెల్లించాలని సెప్టెంబర్‌లో సుప్రీం ఇచ్చిన తీర్పు టెలికాం సంస్థల్లో ఆందోళన పెరిగింది.
* కేంద్రం గనుక ఈ ప్రకటన చేయకపోయి ఉంటే వొడాఫోన్ లాంటి కంపెనీలు తమ సంస్థలను మూసుకోవాల్సి వచ్చేది.
*వొడాఫోన్,భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉండటంతో.. ఉన్నపలంగా బకాయిల చెల్లింపు సంస్థలపై తీవ్ర భారంగా పరిణమించేది.
* ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వొడాఫోన్ రూ.50,921కోట్లు నష్టాన్ని చవిచూసింది. ఒక కార్పోరేట్ కంపెనీకి ఒక త్రైమాసికంలో వచ్చిన నష్టాల్లో ఇప్పటివరకు వొడాఫోన్‌దే అత్యధికం. అలాగే భారతి ఎయిర్‌టెల్ దాదాపు రూ.23,045కోట్లు నష్టాన్ని చవిచూసింది.


views: 602



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams