Current Affairs Telugu Daily

ఫార్చూన్ వ్యాపార నాయకుల జాబితాలో భారతీయులు 

*ప్రపంచంలో ప్రతిష్టాత్మక వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ప్రతి సంవత్సరం టాప్ -20 వ్యాపార నాయకుల జాబితాను విడుదల చేస్తుంది.
*భారతి సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఈ ఏడాది 'ఫార్చ్యున్స్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో ‍ప్రథమ స్థానంలో ఉన్నారు.ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సత్య నాదెల్ల 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టారు. 
*కంప్యూటర్ శాస్త్రవేత్త సత్య నాదెళ్ల ఎప్పు డూ ఫైనాన్స్ రంగంలో పనిచేయలేదు లేదా సిఇఒ వంటి పదవికి శిక్షణ పొందలేదు. గత ఐదేళ్లలో సంస్థను ముందుకు నడిపించారు. అతని విజయానికి కీలకమైనది నాయకత్వ సామర్థ్యం  అని ఫార్చ్యూన్ పేర్కొంది. 
* ఈయనతో పాటు భారతీ య సంతతికి చెందిన అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ), జయశ్రీ ఉల్లాల్‌(ఆరిస్టా హెడ్‌) కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు.
*సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఆసాధ్యమైన అసమానతలను అధిగమించగలిగి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే 20 వ్యాపార నాయకులను ఫార్య్చున్‌ తన వార్షిక 'బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో చోటిస్తుంది. 
* ఈ జాబితాలో బం‍గా 8 స్థానాన్ని సంపాదించగా, ఉల్లాల్‌ 18 వ స్థానంలో నిలిచారు.  మాస్టర్‌కార్డ్‌ ఆర్థిక సేవల్లో తనదైన ముద్రను వేయడం వెనక బంగా దూరదృష్టి ఉందని ఫార్చూన్‌ పేర్కొంది .
*. ఈ జాబితా కోసం క్యాపిటల్‌పై షేర్‌ హోల్డర్లకు ఎంత రాబడి వచ్చింది వంటి పది అంశాలను ఫార్య్చున్‌ పరిశీలించింది.
*ఫార్చ్యున్‌ విడుదల చేసిన ఈ జాబితాలో పెర్త్‌కు చెందిన ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ రెండవ స్థానంలో, ప్యూమా సీఈవో జోర్న్ గుల్డెన్ 5 వ స్థానంలో, జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ 10 వ స్థానంలో, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ 15 వ స్థానంలో, అలీబాబా సీఈఓ డేనియల్ జాంగ్ 16 వ స్థానంలో ఉన్నారు.


views: 611



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams