Current Affairs Telugu Daily

సరోగసీ (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు, 2019

నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలాగా విస్తరిస్తూ అద్దె గర్భాలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందని రాజ్య సభలో పలువురు నాయకులు పేర్కొన్నారు. 
*  చట్టబద్దమైన నియంత్రణ లేని కారణంగా విదేశీయులు నిరుపేద భారతీయ మహిళలకు డబ్బు ఆశ చూపి వారిని గర్భం అద్దెకు ఇచ్చే తల్లుల మాదిరిగా మారుస్తున్నారు.
*బిల్లులో పేర్కొన్న వంధ్యత్వం అనే మాటకు స్పష్టమైన నిర్వచనం లేదు. 
* ఒక మహిళ గర్భం దాల్చగలిగినా బిడ్డను ప్రసవించలేక తరచుగా గర్భస్రావం జరిగే ఆమె వైద్య స్థితిని, అలాగే గర్భధారణకు చేటు కలిగించే హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ వంటి జబ్బులతో బాధపడే పరిస్థితిని విస్పష్టంగా ఈ బిల్లులో నిర్వచించలేదు. 
*దక్షిణాఫ్రికా, నెథర్లాండ్స్‌, గ్రీస్‌ ఇంకా ఇతర దేశాలలో పైన వివరించిన వైద్య సమస్యలతో బాధపడేవారికి సరోగసీకి అనుమతిస్తున్నారు. 
*బిల్లులోని క్లాజ్‌ 4లో పేర్కొన్న విధంగా సరోగసీకి అనుమతి పొందడానికి ఒక జంట ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్‌, ఎలిజిబులిటీ సర్టిఫికెట్‌ పొందాలన్న షరతు విధించడం జరిగింది. 
* అయితే అలాంటి సర్టిఫికెట్‌ జారీకి అధికారులు నిరాకరించిన పక్షంలో అప్పీల్‌ కోసం ఎవరి వద్దకు వెళ్ళాలో ఈ క్లాజ్‌లో వివరించలేదు. 


views: 691



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams