Current Affairs Telugu Daily

శ్రీలంక నూతన ప్రధానిగా మహీంద రాజపక్స

*శ్రీలంక నూతన ప్రధానిగా మహీంద రాజపక్స నియమితులు కానున్నారు. తన సోదరుడైన గోటబాయ రాజపక్స దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మహీందా రాజపక్సను దేశ కొత్త ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
*  ప్రస్తుత ప్రధాని రనిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేశారు. 
* రాజపక్స గతంలో రెండు సార్లు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
*ఆయన పదవీ కాలంలో ఎల్టీటీటీపై పోరాటంలో అమాయక తమిళులను ఊచకోత కోయించారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. 
*. శ్రీలంకలో కొన్ని దశాబ్దాల పాటు జరిగిన అంతర్యుద్ధాన్ని క్రూరంగా అణచివేశారనే ఆరోపణలూ ఉన్నాయి. 
*మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. 2018, అక్టోబర్ 26వ తేదీన మహింద రాజపక్సను ప్రధానిగా నియమించారు. ఆ తర్వాత వివాస్పద పరిణామల నేపథ్యంలో మహిందను తొలగించారు.


views: 682



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams