Event-Date: | 20-Nov-2019 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |
భారత్‌లో బాల్య వివాహాలపై యూనిసెఫ్ నివేదిక
*పాతిక సంవత్సరాలుగా భారత్‌లో బాల్య వివాహాల సంఖ్య తగ్గిందని ఐక్య రాజ్యసమితి పేర్కొంది.
*యూనిసెఫ్ నివేదిక ప్రకారం,భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో బాల్య వివాహాల సంఖ్య తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా బాల్యవివాహాల శాతం భారీగా తగ్గింది.
*గత 3 దశాబ్దాలుగా చిన్నారుల జీవితాలు ఎంతో మెరుగైనా పేద చిన్నారులకు ఆ ప్రయోజనాలు అందేందుకు కృషి చేయాలని యూనిసెఫ్ పేర్కొంది.
*బాల్య వివాహాలు తగ్గడానికి కారణాలు- ఆర్థికాభివృద్ధి, మహిళల సాధికారత ప్రధాన కారణాలు.
*చట్టపర సంస్కరణలు, బాలికా సాధికారతా పథకాలు బాల్య వివాహాలు తగ్గడానికి ఉపయోగపడ్డాయి.
*భారత్‌లో చట్టపరమైన వయస్సు వచ్చే వరకు బాలికలకు వివాహం చేయకుంటే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా పథకాలు ఉన్నాయి.
*గత పాతికేళ్లలో దక్షిణ ఆసియాలో బాల్య వివాహాలు 59 నుంచి 30 శాతానికి తగ్గాయి.