Current Affairs Telugu Daily

డాక్టర్‌ తాళ్లపల్లి మొగిలికి 'లూయిస్‌ పాశ్చర్‌' పురస్కారం

*కేంద్రప్రభుత్వ పట్టు పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విశిష్టసేవలు అందించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన డాక్టర్‌ తాళ్లపల్లి మొగిలికి 'లూయిస్‌ పాశ్చర్‌' పురస్కారం లభించింది.
* సెరికల్చర్‌లో అత్యున్నత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఇంటర్నేషనల్‌ సెరికల్చర్‌ కమిషన్‌ ప్రతిఏడాది లూయిస్‌ పాశ్చర్‌ అవార్డు అందజేస్తుంది. 
* ఈ ఏడాది ఈ అవార్డు తెలంగాణవాసి డాక్టర్‌ తాళ్లపల్లి మొగిలికి దక్కింది. 
* జపాన్‌లోని సుకుబా నగరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ మొగిలి అవార్డును అందుకున్నారు.
*డాక్టర్‌ మొగిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పూర్తిచేశారు. 
*సెరీకల్చర్‌లో కొత్త మల్బ రీ వంగడాలైన జీ 2, జీ 4, వీ1 సృష్టి, బైవోల్టిన్‌ పట్టు అభివృద్ధిలో విశేష కృషిచేశారు.
*పట్టుగూళ్ల పెంపకంలో కొమ్మమేత పద్ధతి అవలంభించి.. పంటకాలాన్ని 25 రోజులకు తగ్గించడంతోపాటు, జపాన్‌ సహకారంతో 'జికా' ప్రాజెక్టులో దశాబ్దంపాటు సేవలు అందించారు. 
*గతంలో భారత్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డు దక్కింది. 
*2019లో తెలంగాణ బైవోల్టిన్‌ పట్టుకు కేంద్రం నాణ్యమైనదిగా పురస్కారం ఇవ్వగా.. ఇప్పుడు తెలంగాణ వ్యక్తికి అత్యున్నత పురస్కారం లభించింది. 
* రాష్ట్ర ప్రభుత్వ సెరికల్చర్‌ సమన్వయ కమిటీ సభ్యుడు జల్లా పుండరీకం


views: 645



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams