Event-Date: | 20-Nov-2019 |
Level: | Local |
Topic: | Awards and honours |
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానం
*మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు దక్కింది.
*కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు.
* దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానం సాధించడం ఇది మూడోసారి.
*ఇప్పటికే పెద్దపల్లి జిల్లా దేశంలోనే తొలిస్థానంలో నిలిచి అవార్డు సాధించగా, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తితో పాటు వివిధ జిల్లాలు దేశంలో మొదటి 10 నుంచి 20 స్థానాల్లో నిలిచాయి.
*స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు మరియు పరిశుభ్రత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ద్వారా ర్యాంకులను అందిస్తుంది.
*ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం --పట్టణాలను నగరాలను పరిశుభ్రంగా ఉంచుకునే లాగా ప్రోత్సహించడం.
* పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను పట్టణ ప్రాంతాల్లో నిర్వహించగా, కేంద్ర తాగునీటి మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
* క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం అంచనాలను చేపడుతోంది.