Event-Date: | 20-Nov-2019 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |
దీన్ దయాల్ అమృత్
దీన్ దయాల్ అమృత్--
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం---అన్ని రాష్ట్రల్లో 'దీన్ దయాల్ అమృత్ పేరిట కేంద్ర ప్రభుత్వం మెడికల్ షాపులు ప్రారంభించనుంది.
* టీచింగ్ హాస్పిటల్స్ నుంచి ఏరియా ఆస్పత్రుల వరకూ దాదాపు 70 సర్కారు దవాఖాన్లలో 'అమృత్' పేరిట మెడికల్ షాపులు ప్రారంభం కానున్నాయి.
*జనరిక్ మెడిసిన్‌తోపాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ సహా అన్ని ఐటమ్స్ ఈ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి.
* ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ఒప్పందం చేసుకుంది.
*ప్రతి ప్రభుత్వ హస్పిటల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, ఈ సంస్థ షాపులు పెట్టి డిస్కౌంట్‌పై మెడిసిన్ అమ్ముతుంది.
* హెచ్ఎల్ఎల్ సంస్థ సొంతంగా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తుండగా, మిగతా వాటిని కంపెనీల నుంచి బల్క్‌లో కొనుగోలు చేస్తుంది.
*ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో తక్కువ లాభం చూసుకుని, ప్రజలకు అందుబాటులో ధరలో మందులు అందిస్తుంది.
* బయటి షాపుల్లో కంటే 30 నుంచి 40% తక్కువకు అమృత్ షాపుల్లో మందులు లభిస్తాయి.
* జనరిక్ మెడిసిన్ షాపులకు మాత్రమే అనుమతినివ్వాలని పదేండ్ల కిందటనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 54) జారీ చేసినప్పటికీ, అది ఎక్కడా అమలు కావడం లేదు.