Current Affairs Telugu Daily

శ్రీలంక నూతన అధ్యక్షుడికి భారత్ పర్యటన 

*శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నవంబర్ 29వ తేదీన భారత్‌ పర్యటన చేపట్టనున్నారు.
*ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆహ్వానం మేరకు రాజపక్సే భారత్‌ పర్యటనకు వస్తున్నారు. 
*అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాజపక్సే పర్యటించే మొదటి దేశం భారత్‌.
* రాజపక్సే ప్రమాణస్వీకారం చేయగానే ఆయన్ను కలిసి అభినందించేందుకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లారు.
* కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి -- ఎస్‌ జైశంకర్‌ 
*సింహళ బౌద్ధులు 70 శాతంగా ఉన్న శ్రీలంకలో మైనార్టీలు (తమిళులు, ముస్లింలు) 25 శాతం దాకా ఉన్నారు.2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలో మహింద రాజపక్సె ప్రభుత్వంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన గొటాబయ రాజపక్సె ఫాసిస్టు హిట్లర్‌ మాదిరిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. యుద్ధ చరమాంకంలో మానవ హక్కులను కాలరాశారు, అనివేలాదిమంది తమిళులను ఊచకోత పోసినట్టు ఆరోపణలు ఉన్నాయి.  యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలతోబాటు, కొలంబోలో ఓ ప్రముఖ సంపాదకుని హత్య కేసుతో ఆయనకు సంబంధమున్నట్లు భావిస్తున్నారు. 
* గొటాబయ రాజపక్సెకు 52.25 శాతం ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి) అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాసకు 41.99 శాతం ఓట్లు లభించాయి.
*గొటాబయ రాజపక్సె విజయంతో శ్రీలంక చైనా వైపు మొగ్గుతోందని, భారత్‌ను దూరంగా ఉంచుతుందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.


views: 655Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams