Current Affairs Telugu Daily

షింజో అబే ఘనత 

*జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అరుదైన ఘనత సాధించారు. ఆ దేశాన్ని సుదీర్ఘకాలం నుంచి పాలిస్తున్న నేతగా సరికొత్త చరిత్ర సృష్టించారు. 
*ప్రధానిగా అబే నవంబర్ 19వ తేదీ నాటికి 2,886 రోజులు పూర్తిచేసుకున్నారు.
* గతంలో టారో కస్తురా సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా నిలవగా.. ఆ రికార్డును అబే నేటితో అధిగమించారు.
*. టారో కస్తురా 1901 నుంచి 1913 మధ్య మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించారు. షింజో అబే 2006లో తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 52ఏళ్లు. 
*అత్యంత చిన్న వయసులో జపాన్‌ ప్రధాని అయిన వ్యక్తి షింజో అబే.
*అనారోగ్య సమస్యలు, కుంభకోణాల కారణంగా కేవలం ఏడాదికే ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2012లో మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అబే ఆ పదవిలో కొనసాగుతున్నారు. 

జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
జపాన్ దేశంలో సుమారు 3,000 పైగా దీవులు ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ మరియు షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే.


views: 623



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams